బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తిపూర్వకంగా హోమ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పాండురంగ స్వామి మాట్లాడుతూ.. విశ్వకర్మ భగవానుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ భక్తి, ధర్మం, సత్ప్రవర్తనను జీవితంలో అలవర్చుకుని ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని సూచించారు.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామి కోలాటం, మహిళల ఆధ్వర్యంలో చెక్కభజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులు శ్యాంసుందర్ రెడ్డి, మారేపల్లి అచ్యుతారెడ్డి, వెంకటేశ్వరాచారి, డాక్టర్ బాలు, సురేష్, శ్రావణి, గంగ, శివ, తిరుపతి, భావన శ్రీ, రేణుకశ్రీ, బ్రహ్మతేజ, షణ్ముఖ శ్రీ, అవంతిక, కృష్ణాజీ, శోభ తదితరులతో పాటు మహిళలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.: సకల సృష్టికి మూలకర్త విశ్వకర్మ భగవానుడు




