నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్‌లో తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ నాయకులు పందెం వెంకటేశ్వర్ రెడ్డి, మాదిరెడ్డి మణికంఠ రెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. దాదాపు 200 మంది విద్యార్థులకు ఈ పరీక్ష ప్యాడ్లు అందజేసి వారికి ప్రోత్సాహం కల్పించారు.

ఈ సందర్భంగా ఎన్ఎస్‌యూఐ నాయకులు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు జీవితంలో ఇది తొలి ముఖ్యమైన మెట్టు అని అన్నారు. కృషి, పట్టుదలతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ణయించుకుని కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరారు.

విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తమ స్టూడెంట్ యూనియన్ అండగా ఉంటుందని వారు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులను ప్రోత్సహించేందుకు పరీక్ష ప్యాడ్లు అందజేస్తున్నామని, భవిష్యత్తులో కూడా విద్యార్థుల కోసం తమ సంఘం ముందుండి సహకరిస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించిన ప్రతి విద్యార్థికి రూ.5,000 చొప్పున బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ నాయకులు నిఖిల్, జాకీర్, రాజు, సిద్దు, నందు తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.: NSUI ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *