నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో శుక్రవారం జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి Kuchukulla Rajesh Reddy ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను గత 30 సంవత్సరాలుగా వైద్యునిగా దంత వైద్య సేవలు అందిస్తున్నానని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో దంత వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, గుండె, ప్రేగు తదితర శస్త్రచికిత్సలు చేయడానికి ముందు కూడా దంత వైద్యుల సూచనలు తీసుకోవడం అవసరమని చెప్పారు.
నవజాత శిశువుల్లో వచ్చే పండ్ల సమస్యలను తొలగించడంలో దంత వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. నోటిలో పళ్లు ఆరోగ్యంగా ఉంటే శరీర ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిబిరంలో స్వయంగా రోగులను పరీక్షించి దంత వైద్య సేవలు అందించారు. అనంతరం ఆసుపత్రి వైద్యుల సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమాదేవి, ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి. శేఖర్, దంత విభాగాధిపతి డాక్టర్ శైలజ, సివిల్ సర్జన్ ఆర్.ఏం.ఓ. డాక్టర్ రవిశంకర్, దంత వైద్యులు డాక్టర్ నాగ మాధురి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రోహిత్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.: ప్రభుత్వ ఆస్పత్రిలో ఘనంగా జాతీయ దంత వైద్యుల దినోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *