నాగర్‌కర్నూల్ జిల్లాలో యువకుడి హత్య కేసు వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కొల్లాపూర్ గ్రామానికి చెందిన అన్నలదాసి జగన్ మోహన్ (32) కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో ఉన్న వ్యక్తిగత విభేదాలు, పాత వైరం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మార్చి 1, 2026 రాత్రి సుమారు 7 గంటల సమయంలో మిద్దె పరుశురాములు (45), కడిరె నాగరాజు (40), కడిరె పార్వతమ్మ (36) కలిసి జగన్ మోహన్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్రలు మరియు రాళ్లతో తీవ్రంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జగన్ మోహన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై మృతుడి అన్న అన్నలదాసి శివశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నాగర్‌కర్నూల్ సబ్-డివిజనల్ పోలీస్ అధికారి బుర్రి శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం కేసు పై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు: జిల్లాలో యువకుడి హత్య కేసు వెలుగు : ముగ్గురు నిందితులు అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *