బీసీ కాలనీకి చెందిన గన్నోజు సురేష్ చారి (40) ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వృత్తిరీత్యా దారువాజా కొలతల పనులు చేసే సురేష్, పెద్దకొత్తపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తులు కారులో సోమశిల వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఢీకొన్న ఘటనలో సురేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.: నాగర్‌కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం
