అదేవిధంగా తెల్కపల్లి, తిమ్మాజీపేట బస్ స్టాండ్ల దుస్థితిని వివరించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. ప్రజల విన్నపం మేరకు నాగర్ కర్నూల్ నుండి నల్గొండకు కొత్త బస్సు సర్వీసును ప్రారంభించాలని, అలాగే నియోజకవర్గంలోని కీలక మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు.
ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ (IAS), టీజీ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి (IPS) తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేసిన సూచనలపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.: నాగర్ కర్నూల్ కొత్త బస్ స్టేషన్‌కు శంకుస్థాపన తేదీ ఖరారు చేయాలి



