నాగర్ కర్నూల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమాజీపేట మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద తోడ్పాటుగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం మరింత సమర్థంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సాయం అందించిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తిమాజీపేట మండల్ ప్రెసిడెంట్ వెంకట్ రామ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *