ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈరోజు (27-02-2026) నిర్వహించిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష మూడవ రోజు విజయవంతంగా పూర్తైంది.
జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ హాజరు వివరాలను వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 5,528 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు కేటాయించగా, 5,356 మంది పరీక్షకు హాజరయ్యారు. 172 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,635 మందికి కేటాయింపులు ఉండగా, 1,552 మంది హాజరై 83 మంది గైర్హాజరయ్యారు.
మొత్తం గా జిల్లాలో 7,163 మంది విద్యార్థులకు కేటాయింపులు ఉండగా, 6,908 మంది పరీక్ష రాశారు. 255 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
పరీక్షలు పారదర్శకంగా మరియు నియమ నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షణ కొనసాగించాయి.
తదుపరి పరీక్షలు కూడా ఇదే విధంగా ప్రశాంతంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు.: ప్రశాంతంగా మూడవ రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు
