
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలు, ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. ధర్మ పరిరక్షణ ద్వారా సమాజంలో ఐక్యత, శాంతి నెలకొంటాయని ఆయన అన్నారు. దేశ సుభిక్షతకు సాంస్కృతిక మూలాలు బలంగా ఉండాలని పేర్కొన్నారు. యువత ధార్మిక చైతన్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.: ధార్మిక చైతన్యానికి యువత ముందుకు రావాలి

