నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గట్టు మల్లన్న జాతర సందర్భంగా రెండు నెలల పసికందు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎనిమిది మంది నిందితులను హత్య నేరం కింద వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నాగర్ కర్నూలు పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులపైనే కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని అన్నారు. రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పసిపాప మృతిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
పసిపాప ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితులకు కఠిన శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీలకతీతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బాధితులకు పక్కా ఇల్లు నిర్మించి గృహప్రవేశానికి తానే హాజరవుతానని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబంలో చదువుకున్న వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో గోరేటి వెంకన్న, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.: నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *