లింగాల మండలం వైపు ట్రాక్టర్ ద్వారా నల్లబెల్లాన్ని తరలిస్తున్న సమయంలో ఎక్సైజ్ సిబ్బంది దాడి చేసి ట్రాక్టర్ (TS 31 2290)ను సీజ్ చేశారు. ఈ ఘటనలో పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల తాండకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడి ఎక్సైజ్ సీఐ బి. నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, ఎస్సై మురళి, కానిస్టేబుల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అక్రమ సారా తయారీపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.: కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడి


