రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు సమాచారం పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక వెల్లడించారు. అక్రెడిటేషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తులపై వస్తున్న వివిధ వార్తల కారణంగా జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఏప్రిల్ 10న రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తులపై స్క్రూటినీ నిర్వహించి, అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వివరించారు.
అక్రెడిటేషన్ కోసం జర్నలిస్టులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే, ఈ నెలలోనే జిల్లా స్థాయిలో కూడా అక్రెడిటేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వారికి అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు.
ఏప్రిల్ నెలలోనే మొత్తం అక్రెడిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అందువల్ల అర్హులైన జర్నలిస్టులు ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.: అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *