తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం గద్వాల పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కుమారుని వివాహ వేడుకకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు కూడా హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

కలెక్టరేట్ వెనుక ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అలాగే సీఎం హాజరుకానున్న కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లను కూడా సమీక్షించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రోటోకాల్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.: గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *