
ఈ కార్యక్రమంలో అచ్చంపేట డిఎస్పి పల్లె శ్రీనివాసులు పాల్గొని డ్రైవర్లకు రోడ్డు భద్రత, కంటి ఆరోగ్యం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సీఐ నాగరాజు, ఎస్సై కె. సద్దాం హుస్సేన్ సహా ఇతర సబ్ డివిజన్ ఎస్సైలు హాజరై శిబిర నిర్వహణలో భాగస్వామ్యమయ్యారు. శివాని ఆప్టికల్కు చెందిన ఆప్టిమెట్రిషియన్ లింగారెడ్డి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆరోగ్య శిబిరాలను మరింత విస్తరించనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.: అచ్చంపేటలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

