తాను ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాట పంథాలోనే ఉన్నానని, రోడ్లు, వీధిదీపాలు, మున్సిపాలిటీ సమస్యలు, ట్యాంక్‌బండ్ రోడ్డు వద్ద బ్రిడ్జ్, మెడికల్ కాలేజ్, ఆసుపత్రి సేవలు వంటి అనేక అంశాలపై ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేసినట్లు చెప్పారు.
ప్రతి సమస్యపై అధికారులను నిలదీస్తూ పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో 8వ వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.: 8వ వార్డు సమస్యలపై పోరాటం
