నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం తుడుకుర్తి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రిసెప్షన్, ఇన్పేషెంట్ విభాగం, జనరల్ వార్డులు, ఫార్మసీ, ల్యాబ్ వంటి విభాగాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న వైద్యులు మరియు సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేస్తూ, రోజువారీగా వచ్చే రోగుల సంఖ్య, ప్రసవాల నిర్వహణపై వివరాలు సేకరించారు.

గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆసుపత్రుల్లో అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసి, ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచాలని సిబ్బందికి ఆదేశించారు.

తనిఖీ అనంతరం అదే ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవనాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. భవిష్యత్తులో ఈ ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలకంగా మారుతుందని కలెక్టర్ ర్కొన్నారు.: తుడుకుర్తి పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *