ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ, ప్రస్తుత చట్టం తమ జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో విఫలమైందని విమర్శించారు. వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి, ట్రాన్స్ జెండర్లకు అనుకూలంగా ఉండే విధంగా కొత్త చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. సమాజంలో తమకు సమాన హక్కులు కల్పించాలని, వివక్ష లేకుండా గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు అవకాశాలు కల్పించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రాంతమంతా మార్మోగేలా ఆందోళన చేపట్టారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం చట్టాల్లో తక్షణ మార్పులు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.: నాగర్ కర్నూల్‌లో ట్రాన్స్ జెండర్ల భారీ ధర్నా


