Tag: nagarkurnool

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వేసవి కాలంలో రక్త కొరతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని సివిల్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ నాయక్ ప్రారంభించారు.

సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి జాతర ఏర్పాట్లు

చారకొండ మండలం సిర్సనగండ్ల అయోధ్యనగర్ గుట్టపై జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు/జాతర ఏర్పాట్లపై అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

NSUI ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్‌లో ఎన్ఎస్‌యూఐ నాయకులు పందెం వెంకటేశ్వర్ రెడ్డి, మాదిరెడ్డి మణికంఠ రెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.

మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సిబ్బందిని సత్కరించి చీరలను పంపిణీ చేశారు.

పరిశుభ్రతపై నిర్లక్ష్యం: తెల్కపల్లి పిహెచ్‌సీ వైద్యులపై ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపాలను గమనించి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు శ్రమదానంలో పాల్గొన్నారు.

జిల్లాలో యువకుడి హత్య కేసు వెలుగు : ముగ్గురు నిందితులు అరెస్ట్

నాగర్‌కర్నూల్ జిల్లాలో యువకుడి హత్య కేసు కలకలం రేపింది. పాత వైరం కారణంగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాడూర్ పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం తాడూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించి, రోగులకు నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని…

తాడూరు ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.