Tag: nagarkurnool

శ్రీశైలం ప్రయాణంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు నాగర్ కర్నూల్ జిల్లాలో ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శ్రీశైలం దర్శనానికి వెళ్తూ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్‌లోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్ వద్ద ఆగగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్…

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: వైద్యాధికారిణి డాక్టర్ వాణి

నాగర్ కర్నూల్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారిణి డాక్టర్ వాణి సూచించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదు

నాగర్ కర్నూల్ జిల్లాలో గృహావసరాలు, విద్యాలయాలు, ఆసుపత్రులకు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సాగు, తాగునీటి సమస్యలు కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

కొల్లాపూర్ సాయి కృప ఆసుపత్రి సీజ్

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. అక్రమ అబార్షన్ల ఆరోపణల నేపథ్యంలో కొల్లాపూర్‌లోని సాయి కృప ఆసుపత్రిని సీజ్ చేశారు.

ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ

నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొని గోపూజ నిర్వహించారు.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం పంపిణీ

పంతుల బాజీరావు మూడవ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలి

అచ్చంపేట మున్సిపాలిటీలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8.68 లక్షల బస్తాల యూరియా రైతులకు అందించగా, 66 వేల మందికి పైగా రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేశారు.

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సిబ్బంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని డాక్టర్ వి. శేఖర్ మరియు డాక్టర్ రవికుమార్ నాయక్ ప్రారంభించారు.

నాగర్‌కర్నూల్‌లో ప్రిజం విద్యాసంస్థ దశాబ్ది వేడుకలు ఘనంగా

నాగర్‌కర్నూల్‌లోని ప్రిజం విద్యాసంస్థ స్థాపనకు పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దశాబ్ది వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 95 టీంల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.