ఏళ్ల తరబడి అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని, ప్రస్తుత వేతనం జీవనానికి సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతన చట్టాన్ని తమపై అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అదనంగా, ఇంధన భత్యం, బీమా సదుపాయం, పీఎఫ్ వంటి ప్రాథమిక హక్కులను కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లను అధికారులు పట్టించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, మీటర్ రీడింగ్ నిలిపివేతతో పాటు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణమే స్పందించాలని స్పాట్ బిల్లర్స్ కోరుతున్నారు: మార్చి 1 నుంచి మీటర్ రీడింగ్ నిలిపివేతకు స్పాట్ బిల్లర్స్ హెచ్చరిక
