జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించే విధంగా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
జాతర రోజుల్లో దేవాలయం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా అన్ని శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుని పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సమావేశంలో దేవాలయ చైర్మన్ రామాశర్మ, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత మల్లేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బలరాం గౌడ్, నరసింహారెడ్డి, తహసీల్దార్, ఎంపీడీవో, దేవాదాయ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి జాతర ఏర్పాట్లు
