నాగర్ కర్నూల్ జిల్లాలో మహిళల భద్రత కోసం పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నాగర్ కర్నూల్ బస్టాండ్ ఆవరణలో మహిళలను వేధిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు జిల్లా షీ టీం వెంటనే స్పందించింది.

షీ టీం సభ్యులు మాఫ్టీ దుస్తుల్లో అక్కడికి వెళ్లి నిఘా ఏర్పాటు చేశారు. మహిళలను వేధిస్తున్న ఇద్దరు నిందితులను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్సై రజిత మాట్లాడుతూ మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహిళల భద్రత కోసం జిల్లా షీ టీం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. మహిళలపై వేధింపులు, అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. మహిళలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.

సహాయం కోసం మహిళలు జిల్లా షీ టీం నంబర్ 8712657676 లేదా అత్యవసర సేవల కోసం 100 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.: మహిళలను వేధించిన ఇద్దరు ఆకతాయిల అరెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *