రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అచ్చంపేట మున్సిపాలిటీలో సమర్థవంతంగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలోని 3వ వార్డు హిందూ స్మశాన వాటికలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా స్మశాన వాటికలోని ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని, దహన సంస్కారాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సరైన దారి వసతులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.

ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12వ తేదీ వరకు ఐదు దశల్లో 99 రోజులపాటు కొనసాగనుందని తెలిపారు.
వివిధ శాఖలకు సంబంధించిన పది ముఖ్య అంశాలపై కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని సూచించారు.
మార్చి 6 నుంచి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో చెత్త నిర్వహణ, పిచ్చి మొక్కల తొలగింపు, ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు.: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *