ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 20 మంది దంపతులు ఈ వ్రతాలలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మోక్ష మార్గాన్ని పొందవచ్చని భక్తులకు అర్చకులు వివరించారు. కోరిన భక్తులకు ప్రతిరోజు ఆలయ ఆవరణలో వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వ్రతం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే శ్రీ బాలాజీ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు జయంత్ కుమార్, శుక్లా, ఆలయ సిబ్బంది బాబయ్య, శివకుమార్ మరియు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: పాలెం వెంకన్న దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు




