నాగర్ కర్నూల్ జిల్లాలో గృహావసరాలు, విద్యాలయాలు మరియు ఆసుపత్రులకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అవసరమైన మేరకు ఎల్పీజీ సరఫరా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సెక్రటేరియట్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇరిగేషన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని సమీక్ష నిర్వహించారు.

ఇరాన్పై యుద్ధ పరిస్థితులు, హర్మూజ్ మార్గం గుండా రావాల్సిన చమురు నౌకలు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గృహావసరాలకు వినియోగించే సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కమర్షియల్ వినియోగాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడకుండా పోలీస్ శాఖ ద్వారా తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 2,50,277 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల సరఫరాలో ఎలాంటి సమస్యలు లేవని, విద్యాలయాలు మరియు ఆసుపత్రులకు కూడా సరిపడా సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. సిలిండర్ బుకింగ్ వ్యవధిని 15 రోజుల బదులు 25 రోజులకు పెంచినప్పటికీ జిల్లాలో సరఫరా సమస్య లేదని తెలిపారు.

అదేవిధంగా జిల్లాలో సాగు మరియు తాగునీటి సమస్యలు కూడా లేవని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ వంటి పంటలు మొత్తం 4,11,002 ఎకరాల్లో సాగు అవుతున్నాయని తెలిపారు. శ్రీశైలం డ్యామ్ లో ప్రస్తుతం 72.4928 టీఎంసీల నీటి నిల్వ ఉందని, దీంతో రాబోయే వేసవికాలంలో తాగునీరు మరియు సాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రబీ సీజన్ పంటల కోతలు పూర్తయ్యే వరకు రైతులకు సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే బోరు బావులపై ఆధారపడిన రైతులకు విద్యుత్ సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.రబీ సీజన్ పంటల కోతలు పూర్తయ్యే వరకు రైతులకు సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే బోరు బావులపై ఆధారపడిన రైతులకు విద్యుత్ సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్, ఇరిగేషన్ సి.ఈ విజయ భాస్కర్ రెడ్డి, ఎస్.ఈ పార్థసారథి, నీటిపారుదల శాఖ అధికారి మురళి, సివిల్ సప్లై అధికారి నరసింహారావు, వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, హార్టికల్చర్ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *