తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వలేమని చెప్పడం, క్లాసులకు అనుమతి నిరాకరించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
దీంతో విద్యార్థులు తమ చదువులను కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులను మధ్యలోనే మానేసి పార్టమ్ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు కూడా ఫీజులు చెల్లించలేక ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ఇదే సమయంలో, ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచినా, పెండింగ్లో ఉన్న నిధుల విడుదలపై స్పష్టత రాకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా వ్యవస్థపై దీని ప్రభావం పడుతోందని వారు పేర్కొంటున్నారు.
ఇదే సమయంలో, ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచినా, పెండింగ్లో ఉన్న నిధుల విడుదలపై స్పష్టత రాకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా వ్యవస్థపై దీని ప్రభావం పడుతోందని వారు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.: పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి




