సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్‌తో కలిసి అదనపు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అధికారులు ముందు ఉంచగా, వాటిని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 44 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను అధికారులు సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన కొత్త అర్జీలతో పాటు పెండింగ్‌లో ఉన్న అర్జీలను కూడా ఒక వారంలోపు పరిష్కరించేందుకు అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.: ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
