నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు అర్జీలను సమగ్రంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా హైకోర్టు, ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి ప్రజావాణి అర్జీలను ప్రాధాన్యంగా తీసుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు.

సోమవారం జరిగిన కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.: ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *