ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌లో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పోలీస్ SHO నియామకానికి ఇప్పటికే జి.ఓ జారీ అయినట్లు తెలిపారు. దీనిని త్వరితగతిన అమలు చేసి పనులు ప్రారంభించాలని కోరారు.
అదేవిధంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలపై కూడా ఎమ్మెల్యే స్పందించారు. నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణ పరిష్కారం కల్పించాలని మంత్రిని కోరారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.: అసెంబ్లీలో నాగర్‌కర్నూల్ సమస్యలపై ఎమ్మెల్యే ప్రస్తావన
