పరీక్ష రాసిన అనంతరం కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన బాలికకు మగ శిశువు జన్మించిన విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో బాలికకు పరిచయం ఉన్న బాలుడే గర్భానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై జేసీడీవో శోభారాణి బాలిక చదివిన పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. విద్యార్థుల పర్యవేక్షణలో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నదేమోనని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ అధికారులకు నివేదికగా పంపినట్లు సమాచారం.: బాలిక గర్భధారణ కేసు: బాలుడిపై పోక్సో కేసు
