ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ టి. సునేంద్ర హాజరై ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి మున్సిపాలిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ బి. రమేష్, 17వ వార్డు కౌన్సిలర్ పి. రాజేశ్వరి, కౌన్సిలర్ ఖజాఖాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎం. రమేష్ విద్యార్థులు రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలని సూచించారు. నీటి ప్రాముఖ్యతపై సిడిఎఫ్ ఆపరేటింగ్ మాస్టర్ అవగాహన కల్పించారు.
కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాంట్ ఏర్పాటుతో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సదుపాయం కల్పించిన కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థకు ప్రిన్సిపాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.: నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం
