నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్య సేవల పర్యవేక్షణలో భాగంగా జిల్లా వైద్యాధికారి డా. రవికుమార్ మంగళవారం సాయంత్రం పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహణ విధానం, రికార్డుల నిర్వహణ, ఔషధాల అందుబాటు తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు.
వైద్యులు మరియు సిబ్బందితో సమావేశమై, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దని, బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు తెల్లని దుస్తులు ధరించడం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా. నారాయణస్వామి, సిహెచ్ఏ శ్రీనివాసులు, స్టాఫ్ నర్స్ భాగ్యమ్మ, ఫార్మసిస్ట్ సంపత్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.: డీఎంహెచ్‌ఓ డా. రవికుమార్ ఆకస్మిక తనిఖీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *