జిల్లా మెడికల్ కళాశాలలో రూ. 23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించారు. అలాగే తెలకపల్లి మండలంలో రూ. 1.59 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయి.
రోడ్డు ప్రమాదాలు, హార్ట్ స్ట్రోక్, విష జ్వరాల వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, ఆధునిక పరికరాల ఏర్పాటు వేగవంతంగా జరుగుతోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, నర్సుల నియామకాలు చేపట్టడంతో పాటు అంబులెన్స్ సేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 43 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
వైద్య విద్యలో భాగంగా 35 మెడికల్ కళాశాలల్లో ఆధునిక బోధన, హాస్టల్, లైబ్రరీ, ల్యాబ్ సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.: నాగర్ కర్నూల్‌లో ₹23.75 కోట్ల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం






