నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఉన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం (ఐడీఓసి) ముందు రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవో) జిల్లా నాయకులు ఆర్టీసీ అధికారులను కోరారు.

సోమవారం నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్యకు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భావాండ్ల వెంకటేష్, జిల్లా కార్యదర్శి షర్ఫుద్దీన్ వినతిపత్రం అందజేశారు. ప్రతిరోజు సుమారు 500 మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ప్రాంతాల నుండి వ్యక్తిగత వాహనాలు లేదా ఆర్టీసీ బస్సుల ద్వారా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వస్తున్నారని వారు తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనుల కోసం రోజూ సుమారు 1500 మంది ప్రజలు, మహిళలు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి వెళ్లుతున్నారని చెప్పారు. ప్రజా సౌకర్యార్థం కలెక్టరేట్ కార్యాలయం వద్ద అన్ని రకాల బస్సులు ఆగేలా రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని వారు డిపో మేనేజర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ జిల్లా కోశాధికారి బాలరాజు, నాయకులు సురేష్, చెన్నకేశవులు, రహీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.: జిల్లా కలెక్టరేట్ వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *