జిల్లాలో 20 మండలాలు, నాలుగు మున్సిపాల్టీల పరిధిలో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో మొత్తం 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ పర్యవేక్షణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, రూట్ అధికారులు సమన్వయంతో ప్రశ్నపత్రాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, ఎంఈఓ కురుమయ్య, ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య, కృష్ణారెడ్డి, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.: పోలీస్ స్టేషన్లకు టెన్త్ ప్రశ్నపత్రాల తరలింపు
