జిల్లాలో నమోదైన 10,651 మంది విద్యార్థుల్లో 10,630 మంది పరీక్షకు హాజరయ్యారు. 21 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. దీంతో హాజరు శాతం 98.80 శాతంగా నమోదైంది. ప్రైవేట్ విద్యార్థులలో ఐదుగురిలో నలుగురు పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అమ్రాబాద్ మండలం మన్ననూర్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాట్లపై ఆరా తీసి విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్యశిబిరం వంటి సౌకర్యాలపై కూడా కలెక్టర్ సమీక్షించారు.
విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కాకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించిన కలెక్టర్, పరీక్షల సమయంలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లాలో పరీక్షల పర్యవేక్షణ కోసం నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. అధికారులు తొలిరోజే 34 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ పాలెం మరియు నాగర్ కర్నూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు.
మొత్తంగా జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలి రోజు తెలుగు పరీక్ష విజయవంతంగా ముగిసింది.: నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం




