ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పంపించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భార్యాభర్తల మధ్య కుటుంబ వివాదానికి సంబంధించిన ఒక ఫిర్యాదు వచ్చిందని, అలాగే తగు న్యాయం కోరుతూ ఐదు ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం పోలీసు శాఖ బాధ్యతగా భావించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ సూచించారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు తెలియజేసుకునే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.: నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో 6 ఫిర్యాదులు
