కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై ఎస్పీ ప్రెస్ నోట్*

* ▪️ 18.02.2026న కుమ్మెర మల్లన్న దేవాలయంలో దర్శనం సమయంలో రెండు వర్గాల మధ్య వివాదం.
* ▪️ క్యూ లైన్ దాటేందుకు ప్రయత్నించారని పూజారి పెద్ద సాయిలు యాదవ్ వివరణ.
* ▪️ శ్రీనివాస్ రెడ్డి డబ్బు అడిగి అశ్లీలంగా తిట్టాడని చంద్రకళ ఆరోపణ.
* ▪️ సాయంత్రం 4:25 గంటలకు గణేష్ “కుమ్మెర గ్రామం వార్తలు” వాట్సాప్ గ్రూపులో ఆడియో పోస్ట్.
* ▪️ ఆడియోపై ప్రశ్నించగా గణేష్ రాయితో కొట్టడంతో శ్రీనివాస్ రెడ్డికి తలకు రక్త గాయం.
* ▪️ రెండు వర్గాల మధ్య పరస్పర దాడులు.
* ▪️ డయల్ 100కు కాల్ – పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను స్టేషన్‌కు తరలింపు.

**కేసుల నమోదు**

* ▪️ క్రైం నెం.53/2026 U/S 118(1), 352 r/w 3(5) BNS కింద శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు.
* ▪️ క్రైం నెం.66/2026 U/S 115(2), 352 r/w 3(5) BNS కింద గణేష్ ఫిర్యాదు.
* ▪️ గణేష్, చంద్రకళకు మెడికల్ పరీక్షలు – సాధారణ గాయాలు మాత్రమే.

*పాప మరణం ఘటన*

* ▪️ 21.02.2026 ఉదయం 7:55కు రెండు నెలల పాప మృతిగా హాస్పిటల్‌లో ప్రకటింపు.
* ▪️ మొదట MLC, PMEకి కుటుంబం నిరాకరణ – తర్వాత అనుమానాస్పద మృతి కేసు (U/S 194 BNSS) నమోదు.
* ▪️ పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్ట్: బాహ్య/అంతర్గత గాయాలు లేవు.
* ▪️ హిస్టోపాథాలజీ, విసెరా రిపోర్టులు FSLకు పంపింపు – ఫైనల్ రిపోర్ట్ పెండింగ్.

*మెడికల్ హిస్టరీ వివరాలు*

* ▪️ పాప 31 వారాల్లో ప్రీమచ్యూర్‌గా 1.44 కిలోల బరువుతో జననం (21.12.2025).
* ▪️ రెస్పిరేటరీ డిస్ట్రెస్, నీయోనేటల్ సెప్సిస్ తదితర సమస్యలతో హైదరాబాద్‌లోని Niloufer Hospitalలో చికిత్స.

*తాజా ఆరోపణలు*

* ▪️ 22.02.2026న మౌనిక ఫిర్యాదు – కులం పేరుతో దూషణ, దాడి ఆరోపణలు.
* ▪️ SC/ST (POA) చట్టం కింద క్రైం నెం.61/2026 నమోదు.
* ▪️ A-1 శ్రీనివాస్ రెడ్డి, A-2 మధు రెడ్డి, A-3 శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ – రిమాండ్.
* ▪️ మిగతా నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు.

**పోలీస్ ముఖ్య గమనికలు**

* ▪️ 18.02.2026 మొదటి ఫిర్యాదులో పాపపై దాడి ప్రస్తావన లేదు.
* ▪️ సంఘటన నుంచి మరణం వరకు పాపకు చికిత్స తీసుకున్న ఆధారాలు లేవు.
* ▪️ కుటుంబం ఐడెంటిటీ ప్రూఫ్, ఇతర వివరాలు ఇవ్వడంలో సహకరించడం లేదు.
* ▪️ స్వతంత్ర సాక్షుల స్టేట్మెంట్లు సేకరణలో పోలీసులు.
* ▪️ గాయాల వల్ల మృతి నిర్ధారణ అయితే మర్డర్ సెక్షన్లు చేర్చుతామని ఎస్పీ స్పష్టం.

*–సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నాగర్ కర్నూల్*: పాప మృతి పై దర్యాప్తు కొనసాగుతోంది, ఎస్పీ స్పష్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *