ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే సహించం…….. దాడి చేసిన వారికి శిక్ష తప్పదు…… ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబిసి ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు…….. నాగర్ కర్నూల్…… మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో మృతి చెందిన చిన్నారి ప్రకటనను ఆసరా తీసుకొని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆ గ్రామ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి రాజకీయ లబ్ధి కోసం వివిధ సంఘాల మేధావులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించడంతోపాటు సంఘటన ఉదాంతాన్ని పక్కదారి పట్టించారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి దళిత సంఘాల నాయకుడు కొత్తపల్లి వెంకటయ్య అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతూ చిన్నారి మరణం బాధాకరమని అన్నారు. కొందరు దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే విధంగా ఇతర ప్రజా సంఘాల రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులకు తప్పుడు సమాచారం అందించి రాద్ధాంతం చేశారని దీనివల్ల దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో దళిత ఉద్యమాలను చేపట్టి బాధిత దళితులకు అండగా నిలిచి ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర ఉందన్నారు. వీధ రాజకీయ పార్టీల జాతీయ రాష్ట్ర నేతలు ఉద్యమాలను ఇంకా పరీక్షల వ్యాఖ్యలు చేస్తూ లేనిది ఉన్నట్లు సృష్టించి రాజకీయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గత నెల 18న జరిగిన సంఘటన తర్వాత బాధితుడు ఫిర్యాదు చేసిన సందర్భంలో ఎక్కడ కూడా కాలితో తన్నారని పేర్కొన లేదని గొడవ జరిగి దాడి మాత్రమే చేశారని వివరించారు. 21న పాప మరణం తర్వాత రాజకీయాన్ని జోడించి కాలితో కన్నడం వల్ల మృతి చెందిందని ఫిర్యాదు చేయడం మా తగదన్నారు. మానవజాతికి తీరని మచ్చ అని దాడి చేసిన వారికి శిక్ష తప్పదని అన్నారు. నేతల స్పందన సరైనదే కానీ తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్టు కాదని తాము పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే స్పందించడం జరుగుతుందని తెలిపారు సమావేశంలో అధ్యక్షత వహించిన వెంకటయ్య మాట్లాడుతూ విశారదన్ మహరాజ్ కేసును తప్పుదారి పట్టించే విధంగా పోలీసులను సైతం దుర్భాషలాడారని. మౌనిక గతం లో ఉన్న గ్రామ సర్పంచ్ పూర్తి వివరాలను నిజ నిర్ధారణ కమిటీకి తెలిపారని అన్నారు వాస్తవాలను వివరించకుండా తప్పుడు సమాచారం అందించడం వల్లే పలువురు మేధావులు విమర్శలు చేస్తున్నారని వాస్తవాలను తెలుసుకొని విమర్శలు చేయాలని కోరారు సమావేశంలో జై భీమ్ దీక్ష వ్యవస్థాపకులు వంకేశ్వరం నిరంజన్ మాట్లాడుతూ దాడి జరిగిన మూడు రోజుల తర్వాత హత్యా కేసు నమోదు చేయాలని కోరడం సరికాదని. గ్రామంలో దర్శనానికి వెళ్లే సందర్భంలో చంద్రకళ కుటుంబం వ్యవహరించిన తిరువలె శ్రీనివాసరెడ్డి అడ్డుకోవడం జరిగిందని అనంతరం ఆమె కుమారుడు గణేష్ దుర్భసలాడుతూ సామాజికమధ్యంలో పోస్ట్ పెట్టడం ఎదురుపడిన సందర్భంలో దూషించుకోవడం వల్లే గణేష్ పై దాడి చేశారని ఆ సందర్భంలో చిన్నారి పాప అక్కడ లేదని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలని కోరారు ఈ సమావేశంలో జెట్టి వెంకటేష్ నాగులయ్య భాస్కర్ తో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు: కుమ్మెర ఘటనను రాజకీయ లబ్ధి కోసం తప్పుదారి పట్టించవద్దు Post navigation జిల్లా ఆసుపత్రిలో సత్యసాయి నిత్య అన్నప్రసాదం పాలెం చిన్నారి మృతి ఘటనపై వేగవంతమైన విచారణ చేపట్టాలి