డా. విశారదన్ మహరాజ్‌ను ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా పోలీసులు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఆయన ఎక్కడ ఉన్నారనే సమాచారం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని నేతలు మండిపడ్డారు.
ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో BC, SC, ST జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, డాక్టర్ విశారదన్ మహరాజ్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని వారు పేర్కొన్నారు.: ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితుల కోసం పోరాటం


