ఈ సందర్భంగా మహిళా అధికారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే మహిళా సిబ్బందిలో ఉత్సాహం పెంచే ఉద్దేశంతో “థగ్ ఆఫ్ వార్” (Tug of War) క్రీడను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలోనే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. నేటి కాలంలో మహిళలు విద్య, వైద్యం, పరిపాలన, రక్షణ, క్రీడలు మరియు సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు.పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ధైర్యం మరియు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల భద్రతకు విశేష సేవలు అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. శాంతి భద్రతలను కాపాడడంలో మహిళా పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, విధుల్లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయాలను సాధించగలరని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీఎంహెచ్వో, జిల్లా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గీతాంజలి, నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, ఆర్ఎ జగన్, సబ్ ఇన్స్పెక్టర్లు గోవర్ధన్, గౌస్ పాషా, రజిత, రమాదేవి, లలితా తదితరులు పాల్గొన్నారు.
అలాగే జిల్లాలో పనిచేస్తున్న మహిళా అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ద్వారా మహిళా అధికారుల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించడం జరిగింది.: జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా అధికారులకు ప్రత్యేక కార్యక్రమం









