ఎంపీఆర్ మరియు కూచుకుల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఆర్పీలు, శానిటేషన్ మహిళా సిబ్బందికి చీరలను అందజేసి శాలువాలతో సత్కరించారు. మహిళల సేవలను గుర్తిస్తూ వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో ముందుండాలని, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు అమూల్యమని ఆయన కొనియాడారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి, కార్యాలయ సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందికి గౌరవం తెలుపుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషంగా నిలిచింది.: మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు





