నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని Palem గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీమతి ఏ. శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. 1975లో United Nations మార్చి 8ను అధికారికంగా మహిళా దినోత్సవంగా గుర్తించినట్లు వివరించారు.

మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించేందుకు మహిళా దినోత్సవం ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల సాధికారత, హక్కుల పరిరక్షణకు ఈ దినోత్సవం దోహదం చేస్తుందని పేర్కొన్నారు. లింగ సమానత్వం కోసం పురుషులు, మహిళలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థి దశ ఎంతో కీలకమని, జీవితంలో లక్ష్యంతో కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ శ్రీరామ్ ఆర్య, కళాశాల ప్రిన్సిపల్ శ్రీ రాములు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.: పాలెం డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *