ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాప్తి, నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని పేర్కొన్నారు. ప్రతి సమావేశంలోనూ హెచ్ఐవి నివారణపై చర్చలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనుమానం ఉన్నవారు ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని, హెచ్ఐవి పరీక్షలు పూర్తిగా గోప్యంగా నిర్వహించబడతాయని భరోసా ఇచ్చారు.
ర్యాలీ పాత కలెక్టరేట్ నుంచి ప్రారంభమై ప్రభుత్వ ఆసుపత్రి వరకు సాగింది. జిల్లా ఆస్పత్రిలోని మైత్రి క్లినిక్‌లో 10 మంది ట్రాన్స్ జెండర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, సబ్ జైల్లో ఖైదీలకు హెచ్ఐవి, హెపటైటిస్ బి & సి, సిఫిలిస్ పరీక్షలు చేశారు. అలాగే కంటి పరీక్షలను కూడా వైద్య బృందం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఎన్జీవోలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలో హెచ్ఐవి/ఎయిడ్స్ పై అపోహలను తొలగించి, నివారణ చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.: హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహన “రెడ్ రన్” ర్యాలీ




