షెడ్యూల్ ప్రకారం, మంత్రి ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, ఉదయం 11:30 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డుల స్క్రీనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30కి అక్కడి నుంచి బయలుదేరి, 1:30 గంటలకు నాగర్ కర్నూల్ చేరుకుంటారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీసీబీ ప్రారంభోత్సవంలో పాల్గొని, విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తెలకపల్లి మండలంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొననున్నారు.
సాయంత్రం 3:00 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభించి, సాయంత్రం 5:00కి చేరుకోనున్నారు. మంత్రి పర్యటనకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.: నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన
