5
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి కుటుంబ సమేతంగా రోడ్డు మార్గాన శ్రీశైలం ప్రయాణం చేస్తున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్ గ్రామ పరిధిలో ఉన్న తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మరియు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛం అందించి గవర్నర్కు ఘన స్వాగతం పలికారు.
అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన శ్రీశైలం దేవస్థానానికి బయలుదేరి వెళ్లారు. గవర్నర్ శ్రీశైలంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం లో స్వామివారిని మరియు అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధికారులు భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా మార్గమధ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, ఇతర పోలీసు అధికారులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.: శ్రీశైలం ప్రయాణంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు నాగర్ కర్నూల్ జిల్లాలో ఘన స్వాగతం



