• కేంద్ర ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేసే కుట్ర.
. ఏఐఎస్ఎఫ్ తెలకపల్లి మండల నూతన సమితి ఎన్నిక తెలకపల్లి సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి బలుమల ప్రేమ్ కుమార్ . మాట్లాడుతూ
• కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ యందు ప్రవేశపెట్టిన2026-2027 వార్షిక బడ్జెట్ లో విద్యా రంగానికి అన్యాయం చేస్తున్నది. 12 ఏళ్ల మోడీపాలనలో విద్యా రంగానికి కేటాయింపులు తగినమొత్తంలో జరగటంలేదు. ఈ సంవత్సరం 53.5 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్లో విద్యకు కేటాయించిన నిధులు కేవలం 1,39,289 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్లో 2.6 శాతం మాత్రమే! ఈ నిధులు పెరిగినట్లు కనిపించినప్పటికీ మొత్తం బడ్జెట్ లో శాతంలో పెరుగుదల లేదు. కేంద్ర బడ్జెట్ లో కనీసం 10%, జిడిపిలో 6శాతం నిధులు కేటాయించాలని అనేక సంవత్సరాలుగా విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు.తెలంగాణ విభజన హామీ చట్టంలో ఉన్న విద్యాసంస్థలను కేటాయించకుండా, రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించకుండా అడుగడుగునా మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న కూడా తెలంగాణకి రావలసిన నిధులు, హక్కుల గురుంచి నోరుమెదపలేని పరిస్థితి నెలకొన్నది. రాజకీయ ప్రసంగాలు చేయడంలో ముందు వరుసలో ఉండే బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చేతులు కట్టుకొని ఉంటూ.. తెలంగాణలో ఉన్న విద్యార్థులను, ప్రజలను మోసం చేస్తున్నారు.గత సంవత్సరం బడ్జెట్ 48,21,000,ల కోట్లు కాగా విద్యకు కేటాయించింది 1,28,628 కోట్లు, మొత్తం బడ్జెట్ లో 2.6 శాతం మాత్రమే. బడ్జెట్ కేటాయింపులు లేకుండా బడ్జెట్ ప్రసంగాలు ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య అందని ద్రాక్షగా మిగులుతుంది. అని బలుమల ప్రేమ్ కుమార్ తెలియజేసారు.
ఏఐఎస్ఎఫ్ తెలకపల్లి మండలం నూతన సమితి ఎన్నిక అధ్యక్షులుగా భాస్కర్, కార్యదర్శులుగా భవాని, ఉపాధ్యక్షులు స్రవంతి, సహాయ కార్యదర్శిలుగా సరస్వతి, కోశాధికారిగా శిరీష ఎన్నుకోవడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దేశమని అంజనేయులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివ, రాహుల్, రవి, మల్లికార్జున్, లక్ష్మి, మరియు తదిత్తులు పాల్గొన్నారు: కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *