Category: Telangana News

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.

అదనపు కలెక్టర్‌గా జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరణ

నాగర్‌కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా జీ.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఈవో దేవ సహాయం నుంచి బాధ్యతలు తీసుకున్నారు.

రేపే టెన్త్ హాల్ టికెట్ల విడుదల – అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ అవకాశం

తెలంగాణ పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే అవకాశం కల్పించారు.

జిల్లాలో యువకుడి హత్య కేసు వెలుగు : ముగ్గురు నిందితులు అరెస్ట్

నాగర్‌కర్నూల్ జిల్లాలో యువకుడి హత్య కేసు కలకలం రేపింది. పాత వైరం కారణంగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాడూర్ పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం తాడూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించి, రోగులకు నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని…

బాలిక గర్భధారణ కేసు: బాలుడిపై పోక్సో కేసు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని స్కానింగ్ కేంద్రంలో ప్రసవించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి 17 ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీస్ స్టేషన్లకు టెన్త్ ప్రశ్నపత్రాల తరలింపు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య ఆయా పోలీస్ స్టేషన్లకు భద్రపరిచారు. జిల్లాలో 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

విజయ్ దేవరకొండ–రష్మికను కలిసిన కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేట గ్రామంలో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దంపతులు కలసి జ్ఞాపిక అందజేశారు.

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.

జియో కార్యాలయ మేనేజర్‌పై అసభ్య ప్రవర్తన ఆరోపణలు

మహబూబ్‌నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ జియో కార్యాలయ మేనేజర్‌పై మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు కాగా, యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చింది.

కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు

కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.