Author: voiceofnagarkurnool@gmail.com

ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు

నాగర్ కర్నూల్ ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు స్వీకరించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వినతులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

పదో తరగతి పరీక్షలకు సమగ్ర ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు 60 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

కుమ్మెర చిన్నారి హత్య ఘటనపై డీజీపీకి వినతిపత్రం

కుమ్మెర జాతరలో చిన్నారి హత్య ఘటనపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కుమ్మెర బాధితులకు సత్వర న్యాయం

కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాగర్ కర్నూల్‌లో నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.

కుమ్మెర జాతర ఘటనపై రాస్తారోకో

కుమ్మెర జాతర ఘటనలో రెండు నెలల పాప మృతి చెందిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

కుమ్మెర ఘటనలపై నిందితుల అరెస్ట్

కుమ్మెర జాతర ఘటనలపై నాగర్ కర్నూల్ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి పలు కేసుల వివరాలు వెల్లడించారు. శిశువు మృతి కేసుతో పాటు దాడులపై కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశారు.

న్యూ గీతం ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

నాగర్ కర్నూల్‌లోని మన భూగీతం ప్రైమరీ స్కూల్‌లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. వివిధ పరిపాలనా పాత్రలు పోషిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఘనంగా శనేశ్వర స్వామికి పూజలు

నంది వడ్డేమాన్ గ్రామంలో శనివారం శనేశ్వర స్వామికి భక్తులు ఘనంగా తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. శని గ్రహ దోష నివారణకు ప్రత్యేక అర్చనలు, రుద్రాభిషేకాలు జరిపారు.

డాక్టర్ భీమ్ భరత్‌కు తెలంగాణ గవర్నర్ అభినందనలు

రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామానికి చెందిన MBBS విద్యార్థి డాక్టర్ భీమ్ భరత్‌ను తెలంగాణ గవర్నర్ అభినందించారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు పొందారు.