తొలిరోజు మందకోడిగా నామినేషన్ల దాఖలు…… నాగర్ కర్నూల్….. జిల్లాలోని మూడు మునిసిపాలిటీలలోని 65 వార్డులకు మొదటి రోజు 32 నామినేషన్లు దాఖలయ్యాయి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో పదిమంది 11 నామినేషన్లను దాఖలు చేయగా కల్వకుర్తి 14 మంది 14 నామినేషన్లను దాఖలు చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏడుగురు ఏడు నామినేషన్లను దాఖలు చేశారు వీటిలో బిజెపి నుండి కల్వకుర్తి మునిసిపాలిటీలో ఐదుగురు నామినేషన్లను దాఖలు చేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో ముగ్గురు కల్వకుర్తి మునిసిపాలిటీలో ఏడుగురు కొల్లాపూర్ మున్సిపాలిటీలో ముగ్గురు నామినేషన్లను దాఖలు చేశారు,బి ఆర్ఎస్ నుండి నాగర్ కర్నూల్ మునిసిపాలిటీలో ఏడు కొల్లాపూర్ మున్సిపాలిటీలో ముగ్గురు నామినేషన్లను దాఖలు చేశారు నాగర్ కర్నూల్ లో బిఎంపి అభ్యర్థి ఒకరు దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థులు కల్వకుర్తి మునిసిపాలిటీ లో ఇద్దరు కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఒకరు నామినేషన్లను దాఖలు చేశారు: తొలి రోజు మందకొడిగా నామినేషన్లు దాఖలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *